కేంద్రం నుంచి సంక్షేమ పథకాల కోసం నిధులు వచ్చినా ఇక్కడ ఆగిపోతున్నాయని కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ఆరోపించారు. ఇవాళ మెదక్ జిల్లా నర్సాపూర్ లో భూపేందర్ యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు నేతలు బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పేదలకు పథకాలు అందకుండా పోతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని తెలిపారు.
రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందని భూపేంద్ర యాదవ్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలనకు చోటు లేదన్నారు. రాజస్థాన్ లో ఇద్దరు పార్టీ నేతలను ఏకం చేయలేని వారు భారత్ ను ఏకం చేస్తారా అని రాహుల్ జోడో యాత్రపై భూపేంద్ర యాదవ్ సెటైర్ విసిరారు.