బీఆర్ఎస్​ను కూకటివేళ్లతో పెకిలించాలి: బీఎల్​ వర్మ

బీఆర్ఎస్​ను కూకటివేళ్లతో పెకిలించాలి: బీఎల్​ వర్మ

హసన్ పర్తి/పరకాల,  వెలుగు : బీఆర్ఎస్ ను కూకటివేళ్లతో పెకిలించాలని కేంద్ర సహకార శాఖ మంత్రి బి.ఎల్ వర్మ కోరారు. శుక్రవారం హసన్ పర్తి 66వ డివిజన్ లోని మహాలక్ష్మి హాల్​లో బీజేపీ యువమోర్చా పార్లమెంట్ ప్రవాస్ యోజన యువమోర్చా సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. యూపీలో ఆ పార్టీ ఉనికే లేకుండా పోయిందన్నారు. పరకాల జీఎస్ఆర్ ​గార్డెన్స్​లో నిర్వహించిన వరంగల్​పార్లమెంటు ప్రవాస్​ యోజన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణలో 2014లో ఏర్పాటైన ప్రభుత్వంలో మహిళా మంత్రులు లేరని, మోడీ దేశానికి మహిళను రాష్ట్రపతిగా, రాష్ట్రానికి కూడా మహిళను గవర్నర్​గా చేశాడన్నారు.

ఈసారి రాష్ట్రంలో డబుల్ ​ఇంజిన్ ​సర్కార్​ను అధికారంలోకి తేవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు డాక్టర్​ పెసరు విజయచందర్​రెడ్డి, మొలుగూరి భిక్షపతి, పగడాల కాళీప్రసాద్​, గుజ్జ సత్యనారాయణ, పార్లమెంట్​కన్వీనర్​ కుమారస్వామి, పార్లమెంటు ప్రభారి డాక్టర్​ మురళీధర్, మహిళా మోర్చ అధ్యక్షురాలు బండారి కళ్యాణి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్థినేని ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్​రావు, నాగర్​కర్నూల్ పార్లమెంట్ ప్రభారీ ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు చీటూరి అశోక్, రాష్ట్ర అధికార ప్రతి నిధి రాకేశ్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ఇన్​చార్జ్ ఉమారాణి, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.