ఖమ్మం: కేంద్రం సహకార సంఘ సహాయ మంత్రి బీఎల్ వర్మ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. లక్ష్మీపురం దగ్గర కోదాడ నుంచి ఖమ్మం వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు సూచించారు. నిర్మాణ పనులు తర్వగా పూర్తి చేసి రహదారిని ఆందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర మంత్రి వర్మ ఆదేశాలిచ్చారు.