ములుగు/ వెంకటాపూర్ (రామప్ప)/ మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మోదీ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి, పరిశ్రమ శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన రామప్ప టెంపుల్ ను సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ములుగు మండలం ఇంచర్ల ఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ములుగు, భూపాలపల్లి సిరికొండ బలరాం, నిశిధర్ రెడ్డి అధ్యక్షతన, మహబూబాబాద్జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ 100 సభ్యత్వాలు చేయించాలని, ప్రతి బూత్ స్థాయిలో కనీసం 200 సభ్యత్వాలు చేయించాలన్నారు. కార్యక్రమంలో సభ్యత్వ నమోదు రాష్ట్ర సహా ప్రముఖ మాజీ శాసనసభ్యులు ధర్మారావు, జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్రావు, అజ్మీర సీతారాం నాయక్, ఆరూరి రమేశ్, మహబూబాబాద్జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.