ఎలక్ట్రిక్ వెహికల్స్​ను ప్రోత్సహించడానికి త్వరలో ఫేమ్​-3: కేంద్ర మంత్రి కుమారస్వామి

ఎలక్ట్రిక్ వెహికల్స్​ను ప్రోత్సహించడానికి త్వరలో ఫేమ్​-3: కేంద్ర మంత్రి కుమారస్వామి

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్​ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఫేమ్ –3 స్కీమ్‌‌‌‌పై పనిచేస్తోందని, ఇది సమీప భవిష్యత్తులో అమలులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి హెచ్‌‌‌‌డీ కుమారస్వామి మంగళవారం తెలిపారు.  అయితే, ఫాస్టర్ అడాప్షన్ అండ్​ మాన్యుఫాక్చరింగ్​ఆఫ్​ హైబ్రిడ్, ఎలక్ట్రిక్​ వెహికల్స్​ (ఫేమ్) స్కీమ్​ను రాబోయే కేంద్ర బడ్జెట్‌‌‌‌లో ప్రకటించడం లేదని భారీ పరిశ్రమలు,  ఉక్కు శాఖ మంత్రి ఢిల్లీలో మంగళవారం మీడియాకు వెల్లడించారు.

 ఫేమ్​–3కి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, అన్ని మంత్రిత్వ శాఖలు ఫేమ్​–3ను ఎలా అమలు చేయాలో సిఫార్సు చేశాయని వివరించారు. అమలుకు కొన్ని నెలలు లేదా కొన్ని రోజులు పడుతుందని అన్నారు.  భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫేమ్​ పథకం  రెండవ దశ కింద రాయితీలను మార్చి 31, 2024 వరకు అమ్ముడైన వరకు లేదా నిధులు ఖర్చయ్యే వరకు, వీటిలో ఏది ముందు అయితే అది అమలు చేస్తామని ప్రకటించింది.  రాయితీల విలువ రూ.10 వేల కోట్ల నుంచి రూ.11,500 కోట్లకు చేరింది.