HMT కంపెనీ స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నారు : H.D కుమారస్వామి

కుత్బుల్లాపూర్: హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలోని HMT కంపెనీలో  కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి  H.D కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శుక్రవారం పర్యటించారు. HMT సియండి రాజేష్ కోహ్లీని టూల్ డిజైన్ యంత్రాల పని తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. కొందరు ఆక్రమణదారులు HMT కంపెనీకి చెందిన స్థలాలను కబ్జా చేస్తున్నారని.. వాటి సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి అన్నారు. 

దేశానికి ఉపయోగపడే HMT లాంటి సంస్థలను నిర్వీర్యం అయ్యే దశకు తెచ్చారని, దాని వల్ల ఇందులో పని చేసే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కుమారస్వామి అన్నారు. 

సత్వర పరిష్కారానికి కమిటీలను వేసి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కంపెనీలో పని చేసే ఉద్యోగుల సమస్యలపై ఆరా తీశారు. పదవీవిరమణ పొందిన కార్మికుల పెన్షన్, పి ఎఫ్, జీత బత్యాలు ఇతర సమస్యల పై మంత్రులకు కార్మికులంతా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

ALSO READ అనంత్ అంబానీ చొక్కాపై పులితో ఉన్న బ్లూ డైమండ్.. ఎన్ని కోట్లంటే..!