కేంద్ర మంత్రి కైలాశ్‌కు కరోనా

జైపూర్: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. దీంతో జోధ్ పూర్ లోని ఓ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు ఆయన శనివారం ట్వీట్ చేశారు. ‘‘కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లమ్, జ్వరం రావడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది. డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉన్నాను. కొద్దిరోజులుగా నాతో టచ్లో ఉన్నవారు టెస్టులు చేయించుకుని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండండి’’ అని చౌదరి ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్ లోని తన పార్లమెంటరీ సెగ్మెంట్ జైసల్మేర్ లో మూడ్రోజుల పర్యటన తర్వాత ఆయనకు కరోనా లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది.

For More News..

కేరళ విమాన ప్రమాద పైలట్ అమ్మను సర్ ప్రైజ్ చేద్దామనుకున్నడు.. కానీ

రామాలయ భూమి పూజను టీవీల్లో చూసిన 16 కోట్ల మంది

‘‘గందగి ముక్త్ భారత్’’ డ్రైవ్ స్టార్ట్ చేసిన మోడీ