మాకు ఎగ్జిట్ పోల్స్ ను మించి సీట్లు వస్తయ్:కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు

మాకు ఎగ్జిట్ పోల్స్ ను మించి సీట్లు వస్తయ్:కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు
  • ప్రతిపక్షాల సంతోషం రెండ్రోజులే: కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు

ఢిల్లీ: బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకుమించి సీట్లు వస్తాయని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. ప్రతిపక్షాలు ఎగ్జిట్ పోల్స్ ను తప్పుపడుతున్నాయని, వాటి సంతోషం రెండ్రోజులు మాత్రమే ఉంటుందని తెలిపారు.

ఆదివారం ఓ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి భారీ మద్దతు లభించింది. ప్రతిపక్షాలు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుంది. తమకు గట్టి పట్టుందని భావిస్తున్న రాష్ట్రాల్లోను కాంగ్రెస్ కు పరాభవం తప్పదు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో  బీజేపీకి మద్దతు లభించింది.

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బీజేపీకి సీట్లు వస్తాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతాయి. కాబట్టి తమకు ఎదురయ్యే అవమానాల నుంచి తప్పించుకోవడానికి ప్రతిపక్షాలు సాకులను వెతకడానికి సిద్ధమవుతున్నాయి”అని రిజిజు అన్నారు.