యాచకులు లేని సమాజాన్ని నిర్మిద్దాం : కిషన్ రెడ్డి

యాచకులు లేని సమాజాన్ని నిర్మిద్దాం :  కిషన్ రెడ్డి
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు

హైదరాబాద్, వెలుగు: మానవత్వ విలువ లను, సనాతన ధర్మాన్ని తెలియజేస్తూ యాచకులు లేని సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్‌ ఆఫీస్‌లో స్ఫూర్తి, విజేత విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులు కేంద్రమంత్రిని కలిశారు. యాచక రహి త సమాజం, మానవత్వ విలువలు, ధర్మ యుగం అనే అంశాలపై వారు చేస్తున్న కృషి గురించి కేంద్రమంత్రికి వివరించా రు. అవే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ పాడిన పాటల తోపాటు, యాచక రహిత సమాజం లఘు చిత్రాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. 

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, పిల్లలకు దూరమైన తల్లిదండ్రులు తిండిలేక అనేక చోట్ల అడుక్కుంటున్నా రని చెప్పారు. వారిలో ఎంతోమంది శారీరక, మానసిక వికలాంగులున్నా రని, వాళ్లకు వసతులు కల్పిస్తున్నామని వివరించారు. సమావేశంలో స్ఫూర్తి, విజేత విద్యాసంస్థల అధినేత రామ కృష్ణంరాజు, ముదిగొండ విశ్వేశ్వర శాస్త్రి, సుధీర్ వర్మ పాల్గొన్నారు.