అంబర్‌పేట/ఓయూ, వెలుగు: బస్తీల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ చేపడుతామని చెప్పడం హాస్యాస్పదమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ముందు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, మూసీకి ఇరువైపులా రిటర్నింగ్ వాల్స్ నిర్మించాలని సూచించారు. సోమవారం సాయంత్రం అంబర్‌పేటలోని పలు బస్తీల్లో కిషన్‌రెడ్డి పర్యటించారు.
హైటెక్ సిటీని చూపించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరం అనడం సరికాదన్నారు. అలాగే ఓయూ క్యాంపస్ ప్రాంగణంలోని జామై ఉస్మానియా ప్రభుత్వ స్కూల్లోని స్టూడెంట్లకు కిషన్‌రెడ్డి బెంచీలు పంపిణీ చేశారు. సీతాఫల్‌మండీ స్కూల్‌కు ఏబీవీ ఫౌండేషన్ ప్రతినిధులు సహకారంతో టాయిలెట్ క్లీనింగ్ మిషన్‌ను అందజేశారు.