సర్కార్ నిర్లక్ష్యాన్ని వేరేవాళ్లపై నెట్టాలని చూస్తున్నరు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సర్కార్ నిర్లక్ష్యాన్ని వేరేవాళ్లపై నెట్టాలని చూస్తున్నరు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • అల్లు అర్జున్​ అరెస్ట్ ప్రభుత్వబాధ్యతారాహిత్యానికి నిదర్శనం
  • సినీ నటులను కావాలనే టార్గెట్ చేస్తున్నరు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు : సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సర్కార్ నిర్లక్ష్యాన్ని వేరేవాళ్లపై నెట్టాలని చూస్తున్నారని ఆరోపించా రు. శుక్రవారం అల్లు అర్జున్​ను అరెస్ట్ చేసిన తర్వాత కిషన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించి.. అరెస్టును ఖండించారు. సంధ్య థియేటర్ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ.. అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోందని పేర్కొన్నారు.

Also Read :- అరెస్ట్​ అన్యాయం సంబంధం లేని దాంట్లో అల్లు అర్జున్​ను​ అరెస్ట్​ చేశారు

‘హీరో హాజరైన థియేటర్ వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. కానీ, అది చేయకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదు. రాష్ట్రంలో సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది మరోసారి నిరూపితమైంది. ఈ అరెస్టును, పాలకుల అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.