అన్నిరంగాల్లో బాలకృష్ణ విశేష సేవలు

అన్నిరంగాల్లో బాలకృష్ణ విశేష సేవలు
  • పద్మభూషణ్​కు ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

జూబ్లీహిల్స్, వెలుగు : పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన సినీ హీరో, హిందూపూర్​ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కేంద్ర మంత్రి జి.కిషన్​రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్​లోని బాలకృష్ణ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. బోకే ఇచ్చి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. బాలకృష్ణ చిన్న వయస్సులోనే పలు సినిమాల్లో అద్భుతంగా నటించారన్నారు. 

దశాబ్దాలుగా నటుడిగా, గత 15 ఏండ్లుగా ప్రజాప్రతినిధిగా, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్​గా సేవలందిస్తున్నారన్నారు. అన్ని రంగాల్లో విశేషమైన సేవలు అందించిన బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం సంతోషకరమన్నారు. కిషన్​రెడ్డితో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, బూర్గుల శ్యామ్ సుందర్ గౌడ్ ఉన్నారు.