మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపే గెలుస్తది : కిషన్‌‌‌‌రెడ్డి

మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపే గెలుస్తది :  కిషన్‌‌‌‌రెడ్డి
  • కేంద్రమంత్రి కిషన్‌‌‌‌రెడ్డి

యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వంపై ఏడాదిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్‌‌‌‌రెడ్డి అన్నారు. గురువారం భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలను అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌‌‌‌... అశోక్‌‌‌‌నగర్‌‌‌‌లోని లైబ్రరీ వద్ద చర్చకు రావాలని సవాల్‌‌‌‌ చేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో మూడు డీఏలు పెండింగ్‌‌‌‌లో ఉంటే... కాంగ్రెస్‌‌‌‌ వచ్చాక మరో రెండు డీఏలను పెండింగ్‌‌‌‌లో పెట్టిందన్నారు.

ఉద్యోగులకు మెడికల్‌‌‌‌, స్టూడెంట్స్‌‌‌‌కు ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ చెల్లించడం లేదన్నారు. ఉద్యోగులు, మేధావులు తమకు అండగా ఉంటున్నారని, మూడు ఎమ్మెల్సీఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్లే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌‌‌‌ లెక్కనే రేవంత్‌‌‌‌రెడ్డి కూడా తిట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. హత్యా రాజకీయాలను ఉక్కుపాదంతో అణిచి వేయాలని, భూపాలపల్లిలో జరిగిన రాజలింగం హత్యను బీజేపీ ఖండిస్తోందన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్, లీడర్లు కాసం వెంకటేశ్వర్లు, బూర నర్సయ్య, పడాల శ్రీనివాస్, దాసరి మల్లేశం, చందా మహేందర్‌‌‌‌ గుప్తా, మాయ దశరథ ఉన్నారు.