
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ
హైదరాబాద్,వెలుగు: తెలంగాణలోని కంపెనీలతో దావోస్ లో అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటో తనకు అర్థం కావడం లేదని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పెట్టుబడులు రావడం మంచిదేనని, అయితే.. అవి పేపర్లకే పరిమితం కాకూడదన్నారు. శుక్రవారం భారతరత్న కర్ఫూరి ఠాకూర్ జయంతి సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అనంతరం బీజేపీ –2025 డైరీని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ.. ఠాకూర్ రెండుసార్లు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారని, సోషలిస్టు లీడర్‌గా అనేక ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. రాజ్యాంగం, రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తి రాహుల్ గాంధీ అని, అలాంటి వ్యక్తి తమకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని సూచించారు.