రేవ్ పార్టీ నిజమో కాదో తేల్చాలి: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

రేవ్ పార్టీ నిజమో కాదో తేల్చాలి: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి: కిషన్ రెడ్డి  

హైదరాబాద్, వెలుగు:  జన్వాడ రేవ్ పార్టీ నిజమో కాదో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎవ్వరి ఫౌంహౌస్ అయినా దర్యాప్తు జరపాల్సిందేనని అన్నారు. ‘‘పథకం ప్రకారం డ్రగ్స్ ఉంచి అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మరి గతంలో ఫోన్ ట్యాపింగ్ లు చేసి దొంగ వీడియోలు తీసి అవన్నీ జడ్జిలకు పంపారని, అదంతా కుట్ర అని పోలీసులే వాంగ్మూలం ఇచ్చారు కదా?” అని ఆయన ప్రశ్నించారు. 

హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పది నెలల కాలంలో జరిగిన ఒప్పందాలు, అప్పులు, స్థిరాస్తులతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల అమలును వదిలేసి, మూసీ ప్రక్షాళనకు లక్షా యాభై వేల కోట్లని ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు చెప్పాలని, ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో వివరించాలన్నారు.