జైలుకైనా వెళ్తాం.. కానీ పేదల ఇళ్లు కూల్చనియ్యం: కిషన్ రెడ్డి

 జైలుకైనా వెళ్తాం.. కానీ పేదల ఇళ్లు కూల్చనియ్యం: కిషన్ రెడ్డి

మూసీ వద్ద నివసించేందుకు రెడీగా ఉన్నానని, సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూసీ నిర్వాసితులు రెండు నెలలు నిద్రలేని రాత్రులు గడుపుతు న్నారని అన్నారు.  మూసీ నిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుందనన్నారు. ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ లో మూసీ పరివాహక ప్రాంతవాసులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు . ధర్నాలో  పాల్గొన్న ఆయన  పేదలకు ఇండ్లు కట్టిస్తామన్న కాంగ్రెస్.. పేదలు కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తోంది. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. కేసీఆర్ బాటలోనే రేవంత్ సర్కార్ నడుస్తోంది. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళన పేరుతో ఇండ్లు కూల్చివేస్తే ఒప్పుకోం. మెరుగైన ఇండ్లు కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని అడిగారా? అని ప్రశ్నించారు. 

ALSO READ | అదంతా అబద్ధం..ప్రభాకర్ రావు హైదరాబాద్కు రాలేదు

మూసీ పక్కన రిటైనింగ్ వాల్ నిర్మించి పునరుజ్జీవం చేపట్టండని సూచించారు కిషన్ రెడ్డి. జైలుకైనా వెళ్తాం కానీ పేదల ఇళ్లను కూల్చనీయమని స్పష్టం చేశారు. డ్రైనేజీ పొంగుతున్నా పట్టించుకోవడం లేదు. స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదు. వాటిని పట్టించుకోకుండా మూసీపైనే దృష్టి పెట్టారని అన్నారు. పేదల ఇళ్లను కూల్చుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మూసీ నిర్వాసితులకు అన్ని రకాలుగా అండగా ఉండాలని కోరారు. లేకపోతే బీజేపీ తరపున వారికోసం కొట్లాడుతా మని తెలిపారు.