అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తా : కిషన్ రెడ్డి 

అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తా : కిషన్ రెడ్డి 

మెహిదీపట్నం, వెలుగు: నాంపల్లి సెగ్మెంట్ లో అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.  ఆదివారం మెహిదీపట్నంలోని జి. పుల్లారెడ్డి కాలేజీలో బీజేపీ బూత్ స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కష్టపడిన వారికి పార్టీ తప్పక గుర్తిస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో భవిష్యత్ లో ఏ విధమైన అభివృద్ధి చేసుకోవాలో, ఆయా పనులపై వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

 ప్రధాని మోదీ ‘మన్ కి బాత్’ లో భాగంగా తన తల్లి పేరున మొక్క నాటాలని పిలుపునిచ్చారని, ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని సూచించారు. కార్యక్రమంలో నేతలు రాహుల్ చంద్ర, పవన్ కుమార్, దేవర వంశీ   పాల్గొన్నారు.