రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులిచ్చిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు కాబోయే రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని చెప్పారు. 2014కు ముందు తెలంగాణలో 2వేల 511 కిలోమీటర్ల హైవేలుంటే.. తర్వాత 2వేల 483 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. ఆరేళ్లలో రాష్ట్రంలో 99శాతం జాతీయ రహదారులు పెరిగాయని చెప్పారు. అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లకు అనుసంధానిస్తూ.. హైవేల నిర్మాణం జరిగిందని... హైవేల నిర్మాణానికి రాష్ట్రంలో 31వేల 624 కోట్లు ఖర్చు చేశామన్నారు కిషన్ రెడ్డి.
మరిన్ని వార్తల కోసం:
75 ఏండ్లయినా అంబేడ్కర్ కలలు నెరవేరట్లే
పార్టీ నన్ను వదిలించుకుంటేనే మంచిది
అతడి సరాదా.. కోట్లు తెచ్చిపెడుతోంది