Good News: సికింద్రాబాద్​ టూ గోవా ట్రైన్​ ప్రారంభం

Good News: సికింద్రాబాద్​ టూ గోవా ట్రైన్​ ప్రారంభం

సికింద్రాబాద్ నుంచి -గోవా వెళ్లేందుకు  వీక్లి ట్రైన్ ను ఇవాళ ( అక్టోబర్​ 6)  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దసరా  కానుకగా.. సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్తున్న ఈ బై-వీక్లీ రైలును ప్రారంభించిన సందర్భంగా కిషన్ రెడ్డి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రైలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు... పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుందన్నారు. ఇప్పటివరకు.. సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు.. డైరెక్ట్ ట్రెయిన్ ఉండేది కాదన్నారు. ప్రధాని మోదీ  రైల్వే మంత్రి అశ్విన్ కుమార్  లకు   ట్రైన్ వేసినందుకు కిషన్​ రెడ్డి ధన్యవాదాలు  తెలిపారు.  తెలంగాణతో పాటు కర్ణాటక ప్రజలకు కూడా ఈ ట్రైన్ ఎంతో ఉపయోగడుతుందంటూ,,    దక్షిణ మధ్య రైల్వేను ఆధునికరిస్తున్నామని   ఎలక్ట్రీషియన్ వర్క్ పూర్తి అయిందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు.

 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునః నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.ఎయిర్ పోర్ట్ ఎలా ఉంటుందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలా తయారుచేస్తామంటూ... చర్లపల్లిలో త్వరలో రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వస్తుందన్నారు.  త్వరలోనే  చర్లపల్లి రైల్వే టెర్మినల్ పబ్లిక్ కు అంకితం చేస్తామని తెలిపారు.   సికింద్రాబాద్​ నుంచి గోవా వెళ్లే పర్యాటకుల కోసం అక్టోబర్​ 6 న ప్రారంభించిన  సికింద్రాబాద్-వాస్కోడిగామా(Secunderabad- to Vascodigama) రైలు..  దాదాపు 20 గంటలపాటు సాగే ఈ ప్రయాణం.. తెలుగు రాష్ట్రాలతోపాటుగా కర్ణాటక ప్రజలకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ మూడు రాష్ట్రాల పర్యాటక రంగాభివృద్ధికి, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతానికి కూడా సికింద్రాబాద్-గోవా ప్రత్యేక రైలు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.  బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుందని తెలిపారు. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుందన్నారు.

ALSO READ | యంగ్ ఇండియా స్కూల్స్ మోడల్ రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం

సికింద్రాబాద్ నుంచి ఉదయం 11 గంటల 45 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు 7 గంటల 20 నిమిషాలకు వాస్కోడిగామాకు చేరుకుంటుంది.ఈ స్పెషల్ ట్రైన్ కాచిగూడ, షాదర్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, గద్వాల్ , కర్నూల్‌ సిటీ, డోన్‌, గుంతకల్‌, బళ్లారి, హోస్‌పేట్‌, కొప్పల్‌, గదడ్‌, హుబ్బలి, దర్వాడ్‌, లోండా, మడ్గావ్ స్టేషన్‌లలో ఆగుతుంది. ఇక ఈ రైలులో స్లీపర్‌ క్లాస్‌కు రూ.440, థర్డ్‌ ఎకానమీకి రూ.రూ.1,100, ఏసీ త్రీటైర్‌కి రూ.1,185, సెకండ్‌ ఏసీకి రూ.1,700, ఫస్ట్‌ ఏసీకి రూ.2,860గా దక్షిణ మధ్య రైల్వే టికెట్‌ ధరలను నిర్ణయించింది