సినీ నటుడు బాలకృష్ణ ఇంటికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఇందుకే వెళ్లారు..!

సినీ నటుడు బాలకృష్ణ ఇంటికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఇందుకే వెళ్లారు..!

హైదరాబాద్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. కళా రంగంలో అందించిన సేవలకు గానూ పద్మభూషణ్ అవార్డుకు బాలకృష్ణ ఎంపిక కావడం పట్ల కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బాలకృష్ణను నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును నందమూరి బాలకృష్ణకు ప్రకటించడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ఉదయం నుంచి బాలకృష్ణ నివాసం వద్ద అభిమానుల సందడి నెలకొంది.

నందమూరి బాలకృష్ణ నివాసం దగ్గర అభిమానుల కోలాహలం కారణంగా ఇబ్బంది తలెత్తకుండా ఉండటానికి కొందరు పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. ఈ ఏడాది బాలకృష్ణతో పాటు సినీ రంగానికి చెందిన మరో ఐదుగురికి పద్మ భూషణ్‌‌‌‌ అవార్డు లభించింది. తమిళనాడు నుంచి హీరో అజిత్, నటి శోభన, కర్నాటక నుంచి నటుడు అనంత్ నాగ్, మహారాష్ట్ర నుంచి దర్శకుడు శేఖర్‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌, ప్లే బ్యాక్ సింగర్ పంకజ్ ఉధాస్ (మరణానంతరం)ను పద్మ భూషణ్ వరించింది. పశ్చిమ బెంగాల్ నుంచి మ్యూ జిక్ కంపోజర్ ఆర్జిత్ సింగ్ కు పద్మశ్రీ లభించింది.

కోలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరిగా ఉన్న అజిత్ 1993లో ‘అమరావతి’ చిత్రంతో హీరోగా పరిచయమై, ఇప్పటివరకూ అరవైకి పైగా చిత్రాల్లో నటించారు. శివాజీ గణేషన్, రజినీకాంత్, కమల్ హాసన్‌‌‌‌, విజయ్ కాంత్ తర్వాత తమిళనాడు నుంచి పద్మ భూషణ్ అందుకున్న ఐదో నటుడిగా నిలిచారు. నటి శోభన స్వస్థలం కేరళ అయినప్పటికీ తమిళనాడు నుంచి అవార్డుకు ఎంపికయ్యారు.  ఆమె1984లో హీరోయిన్‌‌‌‌గా మలయాళంలో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. దేశవిదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శలు ఇచ్చారు.

ALSO READ | మంత్రి పొంగులేటి పర్యటనలో ఉద్రిక్తత: పోలీసుల లాఠీఛార్జ్..

అనంత నాగ్ కన్నడతో పాటు తెలుగు, మలయాళ,  మరాఠీ, హిందీ భాషల్లో 270కి పైగా సినిమాల్లో నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ 1983లో కల్ట్ క్లాసిక్ ‘మసూమ్‌‌‌‌’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. పూలన్‌‌‌‌ దేవి జీవితం ఆధారంగా తీసిన ‘బాండిట్ క్వీన్‌‌‌‌ (1994)’తో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆయన తీసిన ‘ఎలిజబెత్‌‌‌‌’ సినిమా 7 విభాగాల్లో ఆస్కార్‌‌‌‌‌‌‌‌కు నామినేట్ అయింది.