9 లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ: కిషన్ రెడ్డి

9 లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ: కిషన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంపై అంచనా లేకుండా నిర్లక్ష్యంగా ఖర్చు చేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసిందన్నారు. ఆదిలాబాద్ లో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి... మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చాయన్నారు.   తెలంగాణ 9 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. 

రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని  పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామాల్లో వీధి లైట్లు,రోడ్లు కూడా వేయలేని పరిస్థితి ఉందన్నారు గతంలో కేసీఆర్ తన కుటుంబం కేంద్రంగా పాలన సాగిస్తే..ఇపుడు రేవంత్.. సోనియా ఫ్యామిలీకి అనుకూలంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి . 

మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను నేడు   ప్రగతిపథంలో నడిపే బీజేపీకే మీ ఓటు వేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు కిషన్ రెడ్డి.