కేసీఆరే రైతుల మెడ మీద కత్తి పెడ్తుండు

ఢిల్లీ : కేసీఆర్ దీక్షను రైతులు నమ్మట్లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మంగళవారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన.. బాయిల్డ్ ఇవ్వబోమని కేసీఆర్ లెటర్ ఇచ్చారా లేదా చెప్పాలన్నారు. వడ్లపై లేని సమస్యను ఉన్నట్లుగా చూపిస్తున్నారని తెలిపారు. లేని విషయాలను ఢిల్లీ సభలో వక్రీకరించి చెప్పారన్నారు. లాస్ట్ సీజన్లో అగ్రిమెంట్ చేసుకున్న వడ్లు కూడా రాష్ట్రం ఇవ్వలేదు. రైతులు వరి వేయాలని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్నారు. రైతుల కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్న కిషన్ రెడ్డి.. సమస్య పరిష్కారం దిశగా కేసీఆర్ ఆలోచించాలన్నారు. కొనుగోళ్లపై రైతులను మోసం చేస్తున్నారని.. అగ్రిమెంట్ ప్రకారం కేంద్రం చివరి గింజను కూడా కొంటుందన్నారు. వరిపై కేసీఆర్ పురిలేని మాటలన్నారు.  

సీఎం కేసీఆర్ వైఖరి, వితండవాదం, విషప్రచారం చాలా విచిత్రంగా ఉందన్నారు. వ్యవసాయ మోటర్లకు కేంద్రం మీటర్లు పెడుతుంది అంటూ నానా హంగామా చేశారని.. మీటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని రైతులు కూడా అర్ధం చేసుకున్నారని చెప్పారు. బాయిల్డ్ రైస్ తినే రాష్ట్రాల్లో వినియోగం తగ్గింది. మిగతా ఎక్కడా తినడం లేదు. ఉచితంగా ఇచ్చినా సరే, తినే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలోనే కాదు, బాయిల్డ్ రైస్ ఉత్పత్తి చేసే అన్ని రాష్ట్రాలను కూడా ఇకపై వద్దని కేంద్రం కోరుతూ వచ్చిందని తెలిపారు. గత సీజన్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన బియ్యమే ఇంకా ఇవ్వలేదని.. గత సీజన్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం చివరి గింజ వరకు కొంటామని చెప్పాను. ఆ అగ్రిమెంట్ లో మిగులు బాయిల్డ్ రైస్ ఉంటే, అది కూడా కొంటామన్నారు.  8.34 లక్షల మెట్రిక్ టన్నుల (ఇందులో 1.34 లక్షల బాయిల్డ్ రైస్ కలుపుకుని) ఇవ్వాల్సిన బియ్యమే ఇప్పటివరకు FCIకి అందించలేదని తెలిపారు.

కేసీఆర్ ను కాదని, మేము చెబితేనే రైతులు వరి సాగు చేసినట్టు ప్రచారం చేస్తున్నారని.. మోటర్లకు మీటర్ల విషయంలో ఎలాగైతే తప్పుడు ప్రచారం చేశారో ఇప్పుడు కూడా అలాగే తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా రబీలో వచ్చిన దిగుబడిని డైరెక్ట్ గా మిల్లు పట్టించి ఇవ్వాలన్నారు.  నియమాల ప్రకారం కేంద్రం కూడా కొంత శాతం నూకలు తీసుకుంటుందని.. నియమ, నిబంధనల ప్రకారం 25% నూకలు FCI అనుమతిస్తుందని చెప్పారు. ఇవన్నీ పోను మిగిలే నూకలు చాలా తక్కువ ఉంటాయి. ఆ మాత్రం రాష్ట్రం భరించలేదా? కర్ణాటక, ఏపీ సహా ఇతర రాష్ట్రాలు భరిస్తున్నాయన్నారు. 

కేంద్రం ఇస్తున్న అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ద్వారా రాష్ట్ర సివిల్ సప్లైస్ పనిచేస్తుందని..ప్రతి క్వింటా మీద రూ. 3,187/- కేంద్రం ఖర్చు చేస్తుందన్నారు. బస్తా సంచులకు, సుతిలి దారానికి, హమాలికి.. ఇలా అన్ని ఖర్చులు కేంద్రం భరిస్తుందని తెలిపారు. రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తానని కేసీఆర్ అన్నారని.. ఇది ప్రపంచంలోనే సంచలనం అన్నారు. చరిత్ర సృష్టిస్తాము అన్నారు. కానీ ఇంతవరకు అమలే కాలేదని గుర్తు చేశారు. 24 లేదా 26 లక్షల టన్నుల ఎరువులు తెలంగాణలో రైతులకు 100% ఉచితంగా సరఫరా చేస్తాం అని కేసీఆర్ అన్నారని కేసీఆర్ గతంలో మాట్లాడిన వీడియోలు ప్లే చేసి చూపించారు.