తెలంగాణలో బీఆర్ఎస్ పత్తాలేకుండా పోయింది:కిషన్ రెడ్డి  

తెలంగాణలో బీఆర్ఎస్ పత్తాలేకుండా పోయింది:కిషన్ రెడ్డి  

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు..ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరుగు తూ వస్తోంది. బీఆర్ ఎస్ ను వద్దనుకొని బీజేపీకి ఓటేశారని చెప్పారు. తెలంగాణలో 8సీట్లు గెలిచాం..7 సీట్లలో రెండో స్థానంలో ఉన్నాం..ఎంపీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పత్తా లేకుండా పోయిందన్నారు. చాలా చోట్లు బీఆర్ ఎస్ కు డిపాజిట్లు రాలేదన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలుచుకున్నాం.. తెలంగాణలో భవిష్యత్తు అంతా  బీజేపీదే అని కిషన్ రెడ్డి అన్నారు. 

దేశ ప్రజలు మరోసారి మోదీకి జైకొట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు బీజేపీనికి కోరుకుంటున్నారని చెప్పారు.  ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరుగుతోంది.  బీజేపీకి 35 శాతానికి పైగా ఓట్లు వేశారని చెప్పారు. 

 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందన్నార కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ గెలిస్తే బడుగు బలహీన వర్గాలను అన్యాయం జరుగుతుందని అబద్ధపు ప్రచారం కాంగ్రెస్ చేసిందన్నారు. అయినా దేశ ప్రజలు మరోసారి అధికారం ఇచ్చారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ  పనిచేస్తుందన్నారు కిషన్ రెడ్డి. 

మరిన్ని వార్తలు