కేంద్రీయ విద్యాలయం ఓ మినీ ఇండియా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్​, వెలుగు: ప్రతి కేంద్రీయ విద్యాలయం ఓ శక్తివంతమైన మినీ--ఇండియా అని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పికెట్ కేంద్రీయ విద్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘రాష్ట్రీయ ఏక్తా పర్వ్’లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతిభను వెలికితీయడంలో కేంద్రీయ విద్యాలయాలు అత్యుత్తమమైనవని కొనియాడారు. రాష్ట్రీయ ఏక్తా పర్వ్ ద్వారా దేశ సాంస్కృతిక వైభవాన్ని పెంపొందించడాన్ని అభినందించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలతో స్టూడెంట్లు ఆకట్టుకున్నారు.