గ్లోబల్ లీడర్​గా ఇండియా

కొత్త ఎడ్యుకేషన్‌ పాలసీతో సాధ్యం

సెంట్రల్​ గవర్నమెంట్​ తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్​ పాలసీ–2020 స్కూల్​ స్టేజ్​లో, హయ్యర్​ ఎడ్యుకేషన్​ లో మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్​ సెక్టార్​తో పాటు ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్ల పనితీరులో మార్పుల ద్వారా ఇతర దేశాలతో పోటీపడేలా మన ఎడ్యుకేషన్​ సిస్టంను మార్చుతుంది. మరోసారి ఇండియాను గ్లోబల్​ లీడర్​గా మార్చాలని టార్గెట్​ పెట్టుకున్న సెంట్రల్​ గవర్నమెంట్, ప్రధాని మోడీ​అందుకు తగ్గట్టుగానే న్యూ ఎడ్యుకేషన్​ పాలసీని తీసుకొచ్చారు. యువతలో క్రియేటివిటీని పెంచి.. వారిని ఇన్నోవేషన్స్​ వైపు ఎంకరేజ్​ చేయడానికి, ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా.. సొంత కాళ్లపై నిలబడేలా చేయడం ద్వారా సొసైటీకి, దేశానికి ‘ఆత్మనిర్భరత’ను అందించేందుకు ఈ కొత్త పాలసీ ఒక మెడిసిన్​ లాంటిది. ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రానికి ఈ పాలసీ ఒక వరంలాంటిది. క్రియేటివ్, ఎక్స్​పెరిమెంటల్​ ఎడ్యుకేషన్​ను ఎంకరేజ్​ చేయడం ద్వారా స్టూడెంట్లలో స్కిల్స్​ పెరగడంతోపాటు ఫైనాన్షియల్​గా, సోషల్​గా వీక్​గా ఉన్న స్టూడెంట్లకు సౌలతులు అందించొచ్చు.

పక్క రాష్ట్రాలతో పోలిస్తే స్కిల్స్​ తక్కువే

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్‌టీ) చేపట్టిన నేషనల్ అచీవ్​మెంట్ సర్వే(ఎన్ఏఎస్)లో రాష్ట్రంలోని ఐదు నుంచి 8వ తరగతి వరకు స్టూడెంట్ల నాలెడ్జ్​ ఇతర సౌత్​ఇండియన్​ స్టూడెంట్లతో పోల్చితే తక్కువగా ఉందని వెల్లడించింది. 2014–2017 మధ్యలో తెలంగాణలోని ప్రైమరీ స్కూళ్లలో 1,4-26% మంది స్టూడెంట్లు, హైస్కూల్స్​లో 2,1-47% మంది స్టూడెంట్లు, 40% కన్నా తక్కువ స్కోరు సాధించినట్లు కాగ్ 2018 రిపోర్ట్​స్పష్టం చేసింది.

అమ్మభాషతో ఎంతో మేలు

ఎడ్యుకేషన్, టెక్నికల్​ ఎడ్యుకేషన్​లో అమ్మభాషను వాడాలన్న ఆలోచన స్టూడెంట్లందరికీ ఈక్వల్​ ఆపర్చ్యునిటీస్​ కల్పించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. లోకల్​ లాంగ్వేజ్​లను చేర్చడం ద్వారా, తెలుగులో స్కిల్స్​ను, క్రియేటివిటీని పెంచుకోవడానికి స్టూడెంట్లకు అవకాశం దక్కుతుంది. ఎడ్యుకేషన్​ సెక్టార్​లో బడ్జెట్​ కేటాయింపులు.. జీడీపీలో 6 శాతానికి చేరేలా ప్రభుత్వం పెట్టుబడులను పెంచేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఈ పాలసీ సూచిస్తోంది.  జాబ్​ మార్కెట్​కు కావాల్సినట్టుగా హయ్యర్​ ఎడ్యుకేషన్​లో మార్పులను ఎన్​ఈపీ ప్రతిపాదించింది. ప్రస్తుతం తెలంగాణలో గ్రాస్​ ఎన్​రోల్​మెంట్​ రేషియో(జీఈఆర్) 36.2 శాతంగా ఉంది. 2035 నాటికి టెక్నికల్​ ఎడ్యుకేషన్, హయ్యర్​ ఎడ్యుకేషన్​లో జీఈఆర్​ను 50 శాతానికి పెంచేలా ఈ పాలసీ టార్గెట్​ నిర్దేశించింది.

17వ ప్లేస్‌లో తెలంగాణ

సెంట్రల్​ ఎడ్యుకేషన్​ మినిస్ట్రీ రూపొందించే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్​ ఇండెక్స్(పీజీఐ).. రాష్ట్రాలు, యూనియన్​ టెర్రీటరీల్లో స్కూల్ ఎడ్యుకేషన్​పరిస్థితులను అంచనా వేస్తుంది. 2018–19 ఎడ్యుకేషనల్ ఇయర్​కుగానూ రిలీజ్​ చేసిన రిజల్ట్స్​లో 37 రాష్ట్రాలు, యూటీల్లో తెలంగాణ 17వ ప్లేస్​లో ఉంది. ఈ ఇండెక్స్​లో ఎడ్యుకేషన్​ స్టాండర్డ్స్​ క్వాలిటీ, ఎడ్యుకేషన్​ ఎవైలబులిటీ, ఇన్​ఫ్రాస్ట్రక్చర్,​  ఈక్వల్​ ఆపర్చ్యునిటీస్, అడ్మినిస్ట్రేటివ్​ అంశాలను పరిశీలించారు. సరైన ఇన్​ఫ్రాస్ట్రక్చర్స్ లేకపోవడం, ఈక్వల్​ ఆపర్చ్యునిటీస్​ అందించకపోవడం వంటి వాటి వల్ల రాష్ట్రం వెనకబడింది. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ విషయంలో 30వ ప్లేస్, ఎడ్యుకేషన్​ ఎవైలబులిటీలో 20వ ప్లేస్​లో నిలిచింది. క్వాలిటీ ఎడ్యుకేషన్, లెర్నింగ్​ రిజల్ట్స్​లో టాప్​ టెన్​లో రాష్ట్రం లేకపోవడంలో ఎడ్యుకేషన్​ సెక్టార్​పై తెలంగాణ సర్కార్​కు ఉన్న కమిట్​మెంట్​ను తెలియజేస్తోంది.

తప్పులు సరిదిద్దుకునే చాన్స్

మంచి స్కిల్స్​ కలిగిన సిటిజన్స్​ను రెడీ చేయడం కొత్త ఎడ్యుకేషన్​ పాలసీ లక్ష్యం. ఆరేండ్లలోపే 85 శాతం మంది పిల్లల్లో బ్రెయిన్​ డెవలప్​ అవుతుందని సైకాలజీ సైంటిస్టులు, ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. అందువల్ల ఎర్లీ చైల్డ్​హుడ్​ కేర్ అండ్​ ఎడ్యుకేషన్(ఈసీసీఈ)ని అమలు చేయడం ద్వారా థర్డ్​ క్లాస్​ పూర్తయ్యే నాటికి ప్రతి చిన్నారికి బలమైన పునాది వేయడంతోపాటు స్కిల్స్​ పెంచడంపై దృష్టి పెట్టడం, వారి లెర్నింగ్ రిజల్ట్స్ లో మంచి ఫలితాలు తీసుకురావొచ్చు. 5+3+4+4 సిస్టం ద్వారా ప్రైమరీ స్కూల్, హయ్యర్​ ఎడ్యుకేషన్​కు మధ్య గ్యాప్​ను తగ్గించడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది. టీచింగ్​ స్కిల్స్, ఎడ్యుకేషన్​ మెథడ్స్​పూర్తిగా మార్చేస్తుంది. ఈసీసీఈతో రాష్ట్రంలోని స్టూడెంట్ల లెర్నింగ్ రిజల్ట్స్, స్కిల్స్​ ఎంతో మెరుగవుతాయి. క్రియేటివ్, ఎక్స్​పెరిమెంటల్​ ఎడ్యుకేషన్​ మెథడ్స్​తోపాటు.. స్టూడెంట్ల ఫిజికల్, మెంటల్  ఎబిలిటీని పెంచడానికి ఈ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది.

For More News..

ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

రాష్ట్రంలో కొత్తగా 2,817 కరోనా కేసులు.. 10 మంది మృతి

ఐఏఎస్ , ఐపీఎస్‌ల కోసం మిషన్ కర్మయోగి