కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
గ్రేటర్ నొయిడా (యూపీ): కొన్ని దేశాలు తమ ఆర్మీ బలమైందన్న అపోహలో ఉన్నాయని, కానీ, ఆ దేశాల భ్రమను మన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) పటాపంచలు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కొద్ది రోజులుగా బార్డర్లో జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనమన్నారు. శనివారం ఐటీబీపీ 59వ ఫౌండేషన్ డే సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘శత్రువు ఎప్పుడైనా ఎదురుపడవచ్చు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి. ఈ విషయంలో ఐటీబీపీ ముఖ్యమైన పిల్లర్ గా ఉంది. ఐటీబీపీ జవాన్ల ధైర్య సాహసాలు, డెడికేషన్ పట్ల దేశం గర్విస్తోంది. ఐటీబీపీని మోడర్నైజ్ చేసి మరింత బలోపేతం చేస్తాం. 47 బార్డర్ పోస్టులను ఏర్పాటు చేసేందుకు ఐటీబీపీకి అప్రూవల్ ఇచ్చాం. మౌంటెనీరింగ్ ఎక్విప్ మెంట్, లేటెస్ట్ వెపన్స్ ను కూడా అందించాం. ఒక్క ఏడాదిలోనే 28 లేటెస్ట్ వెహికల్స్ ను ఐటీబీపీ కొనుగోలు చేసింది’ అని అన్నారు. 1962లో చైనాతో యుద్ధం తర్వాత ఐటీబీపీని ఏర్పాటు చేశారు. 60 బెటాలియన్లతో 90 వేల మంది జవాన్లు ఐటీబీపీలో ఉన్నారు. ఎల్ఏసీ వెంబడి లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 3,488 కిలోమీటర్ల బార్డర్ ను ఐటీబీపీ కాపలా కాస్తోంది.
For More News..