నారాయణరావు పవార్ ఇంటికి కిషన్ రెడ్డి

హైదరాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని స్మరించుకుంటుందని ఆయన తెలిపారు. నిజాంకు వ్యతిరేకంగా అతనిపై బాంబు వేసి జైలుకు వెళ్లిన నారాయణరావు పవార్ ఇంటికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లారు. న్యూ నల్లకుంటలోని నారాయణరావు పవార్ ఇంటికి చేరుకుని ఆయన వారసులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నారాయణరావు పవార్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాల్లో రాజకీయలు, కుల, మతాలకు అతీతంగా పాల్గోవాలనాలని కోరారు.