చెడుపై మంచి విజయం సాధించిన రోజున దసరా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇండోనేషియా లాంటి దేశాల్లో కూడా దసరా జరుపుకుంటారని చెప్పారు. కరోనా కారణంగా గత ఏడాది విజయ దశమి పండుగను ఆలయాలకు వచ్చి జరుపుకోలేకపోయామని, ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఘనంగా దసరా పండుగ చేసుకోగలుగుతున్నామని అన్నారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకొంటామని, ఇప్పుడు భారత్ నుంచి, యావత్ ప్రపంచం నుంచి కరోనా పోవాలని, ఈ మహమ్మారిపై మానవాళి విజయం సాధించాలని కోరుకుంటున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వంద కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసిన దేశంగా భారత్ రికార్డు సాధించబోతున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాలు మన వ్యాక్సిన్ అడుగుతున్నప్పటికీ, ముందుగా మన దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేశాకే ఇతర దేశాలకు ఇవ్వాలని ప్రధాని మోడీ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. దసరా సందర్భంగా శుక్రవారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కిషన్ రెడ్డి. అమ్మవారికి వచ్చే కానుకలు దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
మరిన్ని వార్తల కోసం..
అఫ్గాన్ మసీదులో బాంబు పేలుళ్లు.. 32 మంది మృతి
జమ్మి ఆకు కోసం తోపులాట.. పోలీసుల లాఠీ చార్జ్
స్వశక్తితో.. ప్రపంచంలోనే పవర్‌ఫుల్ ఆర్మీగా భారత్!: మోడీ