ఇద్దరు బీజేపీ ఎంపీలకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రాజకీయ నేతలు కూడా కరోనాతో ఆస్పత్రుల పాలవుతున్నారు. సోమవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా సోకగా.. తాజాగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే, బీజేపీ లోక్‌సభ ఎంపీ మనోజ్ తివారీలకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. 

ఎంపీ మనోజ్ తివారీ తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్‌లో తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి తాను అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. తనకు జ్వరం రావడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నానని.. ఆ ఫలితాలు మంగళవారం వచ్చాయని ఆయన తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో సోమవారం కౌశాంబిలోని యశోద ఆసుపత్రిలో చేరారు. చందౌలీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న 65 ఏళ్ల పాండే గతంలో కూడా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకినట్లు ఆయన ట్వీట్ చేశారు. 

‘నేను గత రెండు రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నాను. దాంతో కోవిడ్ పరీక్ష చేయించుకుంటే.. ఆ ఫలితాల్లో పాజిటివ్‌గా వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి నన్ను సంప్రదించిన వారందరూ జాగ్రత్తగా ఉండాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

For More News..

పంజాబ్‌లో స్కూళ్లు, కాలేజీలు క్లోజ్