ఇన్నోవేటివ్​ ప్రొడక్టులు తీసుకురండి: మన్సూఖ్ మండవీయ

  • ఫార్మా ఇండస్ట్రీకి మంత్రి మన్​సుఖ్​​ మాండవీయ పిలుపు
  • ఫార్మాలో మనది గ్లోబల్​గా మూడో ప్లేస్​
  • 10 ఏండ్లలో 120 బిలియన్​ డాలర్లకు ఎదిగే ఛాన్స్​

న్యూఢిల్లీ: వ్యాల్యూ చెయిన్​లో పైకి ఎదిగి గ్లోబల్​ లీడర్​షిప్ సాధించేలా ఇన్నోవేటివ్​ప్రొడక్టులు తేవడం కోసం రిసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​పై ఫార్మా ఇండస్ట్రీ ఫోకస్ పెట్టాలని కేంద్ర కెమికల్ అండ్ ఫెర్టిలైజర్​ శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ పిలుపు ఇచ్చారు. గ్లోబల్​ మార్కెట్ల కోసం క్రిటికల్​ ఎక్విప్​మెంట్​ తయారీ చేపట్టాల్సిందిగా మెడికల్​ టెక్నాలజీ కంపెనీలకు ఆయన సూచించారు. మల్టీ నేషనల్​ కంపెనీలతో పోలిస్తే మన కంపెనీలు రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ మీద చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాయని మాండవీయ పేర్కొన్నారు. 

ఫార్మా–మెడ్​టెక్​ సెక్టార్లలో రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ కోసం  నేషనల్​ పాలసీని మంత్రి లాంఛ్​ చేశారు. మల్టీ నేషనల్​ కంపెనీలు తమ లాభాలలో 20–25 శాతం రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​పై వెచ్చిస్తాయని, మన దేశంలోని కంపెనీల సగటు ఈ అంశంలో 10 శాతమేనని మాండవీయ ప్రస్తావించారు. ఫార్మా, మెడ్​టెక్​ రంగాలలో దేశం తన కాళ్లపై తాను నిలబడాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 

ఫార్మా, ట్రెడిషినల్​ మెడిసిన్స్​, ఫైటో ఫార్మాస్యూటికల్స్​, మెడికల్​ డివైసెస్​ రంగాలలో రిసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ను ప్రమోట్​ చేసేందుకే కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఫార్మా–మెడ్​టెక్​ సెక్టార్ల కోసం ఒక కొత్త స్కీము ప్రమోషన్​ ఆఫ్​ రీసెర్చ్​ అండ్​ ఇన్నోవేషన్​ ఇన్​ ఫార్మా మెడ్​ టెక్​ (పీఆర్​ఐపీ) ని కూడా మాండవీయ లాంఛ్​ చేశారు. దేశంలో రీసెర్చ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ పటిష్టపరిచేందుకు ఈ కొత్త స్కీము సాయపడుతుంది. పీఆర్​ఐపీ స్కీము కోసం బడ్జెట్లో రూ. 5 వేల కోట్లు కేటాయించారు.

 వాల్యూమ్​పరంగా చూస్తే ఇండియా ఫార్మా ఇండస్ట్రీ 50 బిలియన్​ డాలర్ల మార్కెట్​సైజుతో గ్లోబల్​గా మూడో ప్లేస్​లో నిలుస్తోంది. రాబోయే పదేళ్లలో ఈ ఫార్మా ఇండస్ట్రీ 120–130 బిలియన్​ డాలర్లకు ఎదగగల సామర్ధ్యం ఉందని అంచనా వేస్తున్నారు.