దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు రక్షణ కోసం కేంద్రం నిన్నటి నుంచి బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ ప్రారంభించింది. నిన్న తొలి రోజే 9,84,676 మంది మూడో డోసు వ్యాక్సిన్ వేశారు హెల్త్ సిబ్బంది. ఐదు లక్షల 19 వేల 604 మంది హెల్త్ కేర్ వర్కర్లకు, రెండు లక్షల ఒక వెయ్యి 205 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు, అరవై ఏండ్లు పైబడి కోమార్బిడ్ కండిషన్లతో బాధపడుతున్న 2,63,867 మందికి మూడో డోసు వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం పేర్కొంది.
ఇవాళ పలువురు ప్రముఖులు ప్రికాషనరీ డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు. చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (68) మూడో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. అలాగే మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను డబ్బులు కట్టి ప్రికాషనరీ డోసు వ్యాక్సిన్ తీసుకున్నానని చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఆశావాద దృక్పథంతో ఉండాలని, భయపడిపోవద్దని అన్నారు. అర్హత ఉన్న వాళ్లంతా బూస్టర్ డోసు వేయించుకోవాలని నఖ్వీ సూచించారు.
Union Minister Mukhtar Abbas Naqvi takes precaution dose of Covid vaccines
— ANI (@ANI) January 11, 2022
"I took my precaution dose on payment today. We need hope and not horror to fight with Covid-19. All eligible people should get administered with precaution dose," says the Minister pic.twitter.com/t3uNoOBvHM
Tamil Nadu CM MK Stalin takes 'precautionary dose' of COVID vaccine.
— ANI (@ANI) January 11, 2022
The nationwide drive for healthcare workers, frontline workers, and people aged 60 and above with comorbidities kicked off yesterday, January 10. pic.twitter.com/bSfOG70mXl