
ఏపీ రాజకీయాలపై కేంద్ర మంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. ఏపీలో బీజేపీ బలోపేతానికే పురందేశ్వరికి పగ్గాలు అప్పజెప్పామని వెల్లడించారు.
బెంగళూరు నుండి రోడ్డు మార్గం ద్వారా పావగడ కు వెళుతున్న క్రమంలో అనంతపురం జిల్లా మడకశిరలో ఆయన ఆగారు. ఈ క్రమంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం నారాయణస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికలలో బీజేపీ తప్పక విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులతోనే ఎన్నికలకు వెళతారని అధికార వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈ క్రమంలో నారాయణ స్వామి చేసిన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.