2030 నాటికి కోటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముతం: మంత్రి నితిన్​ గడ్కరీ

2030 నాటికి కోటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముతం: మంత్రి నితిన్​ గడ్కరీ

 న్యూఢిల్లీ: మనదేశ ఎలక్ట్రిక్ వెహికల్స్​ మార్కెట్ 2030 నాటికి కోటి యూనిట్ల వార్షిక విక్రయాల మైలురాయిని చేరుకుంటుందని, ఐదు కోట్ల ఉద్యోగాలు వస్తాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తెలిపారు.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (సియామ్) వార్షిక సదస్సులో ప్రసంగించిన ఆయన భవిష్యత్తులో భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటోమోటివ్ హబ్‌‌‌‌‌‌‌‌గా మారుతుందని అన్నారు.  2030 నాటికి భారతీయ ఈవీ మార్కెట్ రూ. 20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని, ఈవీ ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం రూ. 4 లక్షల కోట్లు ఉంటుందని మంత్రి తెలిపారు.   ఈవీల బ్యాటరీల ధర మరింత తగ్గుతుందని పేర్కొన్నారు.

Also Read:-ప్లాస్టిక్ లెస్ సిటీకోసం.. రాంకీతో మారికో