కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో తనకు ఓ ప్రతిపక్ష నేత ప్రధాని పదవి ఆఫర్ చేశారని చెప్పారు. ఏ పదవి కోసం తాను సిద్ధాంతాలకు రాజీపడబోనని చెప్పారు గడ్కరీ.
నాగపూర్ లో జరిగిన జర్నలిస్టు అవార్డు కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు గడ్కరీ. ప్రతిపక్ష నేత ఎవరనే విషయం తాను వెల్లడించలేనన్నారు. జీవితంలో ప్రధాని కావాలనే లక్ష్యం తనకు లేదన్నారు గడ్కరీ. తనకు ఎందుకు మద్దతివ్వాలని ఆ ప్రతిపక్ష నేతకు అడిగినట్లు చెప్పారు.
ALSO READ ; మీరట్లో ఒక్కసారిగా కుప్పకూలిన భవనం.. ఏడుగురు మృతి