కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మరోసారి కొవిడ్ పాజిటివ్

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. ‘తేలికపాటి లక్షణాలతో ఈ రోజు(మంగళవారం) నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారు వెంటనే కొవిడ్ టెస్టులు చేయించుకుని క్వారంటైన్ లో ఉండగలరు’అని ట్వీట్ చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో కూడా గడ్కరీకి  కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీహార్ సీఎం (నితీష్ కుమార్), కర్ణాటక సీఎం (బసవరాజ్ బొమ్మై) తమకు పాజిటివ్ వచ్చినట్లు నిన్న ప్రకటించారు.