అస్తిత్వం కోసం కేటీఆర్​డ్రామాలు : మంత్రి బండి సంజయ్

అస్తిత్వం కోసం కేటీఆర్​డ్రామాలు : మంత్రి బండి సంజయ్
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సెటైర్లు 

హైదరాబాద్, వెలుగు:  అస్తిత్వం కోసం కేటీఆర్​ డ్రామాలు ఆడుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.  అమృత్ టెండర్ల విషయంలో  కేటీఆర్​ చేసిన ట్వీట్​కు బండి సంజయ్​ట్విట్టర్​ వేదికగా కౌంటర్​ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే కాంగ్రెస్ నేతలే తనను అభినందిస్తున్నారని కేటీఆర్ చెప్పుకోవడం కేవలం డ్రామారావు మొమెంట్ మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారని, అమృత్ స్కీమ్ అవినీతిపై గజినీ (కేటీఆర్).. పీఆర్ స్టంట్స్ మానుకోవాలని చురకలంటించారు.

వారు ధూమ్ మచాలే అంటూ తెర వెనుక కాంగ్రెస్ చుట్టూ డ్యాన్సులు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే.. అమృత్​టెండర్ల విషయంపై  బీజేపీ నేతలు మాట్లాడారని అన్నారు. అమృత్ టెండర్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంగ్రెస్ భావిస్తే వెంటనే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ కోరాలని డిమాండ్ చేశారు.  కాగా,  పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ మద్దతు పలికారు.