తెలంగాణ హైకోర్టులో12 జడ్జిల ఖాళీలు..కేంద్ర మంత్రివెల్లడి

తెలంగాణ హైకోర్టులో12 జడ్జిల ఖాళీలు..కేంద్ర మంత్రివెల్లడి
  • రాజ్యసభలో కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘవాల్ వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో 12 జడ్జిల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘవాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 365 మంది జడ్జిల ఖాళీలు ఉన్నాయని గురువారం రాజ్యసభలో వెల్లడించారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 24 శాతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన జడ్జిలు ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో 21 ఫాస్ట్ ట్రాక్ కోర్టులుండగా,  తెలంగాణలో ఒక్కటీ లేదన్నారు.