గోదావరిఖని, జ్యోతినగర్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల కోరారు. శుక్రవారం గోదావరిఖని ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్‌లో పెద్దపల్లి ఎంపీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలతో రివ్యూ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని, కష్టపడి పనిచేస్తే అసెంబ్లీ స్థానాలతోపాటు పార్లమెంట్ సీటు గెలిచే అవకాశం ఉందన్నారు.
అనంతరం రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ రిజర్వాయర్ లో నిర్మించిన 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ను కేంద్ర మంత్రి సందర్శించారు. బీజేపీ లీడర్లు పి.మల్లికార్జున్, రావుల రాజేందర్, రఘునాథ్ రావు, విష్ణువర్ధన్ రెడ్డి, రావుల రాంనాథ్, మహేశ్, వెంకటేశ్వర్ గౌడ్, సోమారపు సత్యనారాయణ, రామిరెడ్డి, సంజీవరావు, శ్రీదేవి, ఎస్.కుమార్, జయశ్రీ, రాంచందర్, పాల్గొన్నారు.