AP News: ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం.. కేంద్రమంత్రి పెమ్మసాని.. 

ఏపీ అంటే కొత్త అర్థం చెప్పారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అని అన్నారు.ఏపీకి కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తీ చేయటానికి కట్టుబడి ఉందని అన్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులను అన్ని విధాలా రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమరావతికి కేటాయించిన నిధుల్ని అప్పు అని ప్రచారం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రానికి బయట ఎక్కడా అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన అన్ని రకాల నిధులను రాబట్టి ఈ ఐదేళ్ళలో అమరావతిని అభివృద్ధి చేసి, పోలవరాన్ని పూర్తీ చేస్తామని అన్నారు.