ఇండియాలో పెట్టుబడులు పెట్టండి: కేంద్రమంత్రి పీయూష్ గోయల్

ఇండియాలో పెట్టుబడులు పెట్టండి: కేంద్రమంత్రి పీయూష్ గోయల్

 

  • ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ఐలకు పీయూష్ గోయల్ పిలుపు

న్యూఢిల్లీ: పెట్టుబడులు పెట్టేందుకు ఇండియా అనువైన దేశంగా ప్రమోట్ చేయాలని యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నివసిస్తున్న  ఇండియన్లను కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ కోరారు. వివిధ సెక్టార్లలో ఉన్న అపార అవకాశాల గురించి వివరించారు. ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుందని అన్నారు. 

వ్యాపారం మరింత సులభంగా మార్చడం, రూల్స్ భారాన్ని తగ్గించడం,  స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి కొత్త సెక్టార్లను అందుబాటులోకి తేవడం, విదేశీ పెట్టుబడిదారులకు మద్ధతుగా ఉండడం వంటి చర్యలు తమ ప్రభుత్వం తీసుకుందని అన్నారు.  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మేలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐలు 3 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారని, తమ రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టు    చాలా మంది  ఇండియన్ స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాండ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యాంకింగ్ సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.