20 కోట్ల మందిని సభ్యులుగా చేర్చాలి : కేంద్ర మంత్రి ప్రహ్లాద్​జోషీ

20 కోట్ల మందిని సభ్యులుగా చేర్చాలి : కేంద్ర మంత్రి ప్రహ్లాద్​జోషీ

కామారెడ్డి, వెలుగు : 20 కోట్ల మందిని సభ్యులుగా చేర్చాలన్నది బీజేపీ లక్ష్యమని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి అన్నారు.  మంగళవారం  కామారెడ్డిలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.  ఇప్పటికే ఏడు కోట్ల సభ్యత్వ నమోదు పూర్తయ్యిందన్నారు.  దేశంలో తెలంగాణ, తెలంగాణలో కామారెడ్డి సభ్యత్వ నమోదులో  ఫస్ట్ ఉండాలన్నారు.  బూత్​కి 200 మందిని  చేర్చించాలని దిశానిర్దేశం చేశారు.  ప్రతీ బూత్​లో  పార్లమెంట్​ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే  ఎక్కువ మంది సభ్యులుండాలన్నారు.  

 స్వచ్ఛభారత్ పై  అవగాహన కోసమే..

 స్వచ్ఛ భారత్​ ఉద్దేశం లీడర్లు రోడ్లు ఊడ్చటం కాదని , ప్రజలకు అవగాహాన  కల్పించటమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  కామారెడ్డి కొత్త బస్టాండ్​ వద్ద  నిర్వహించిన స్వచ్ఛ భారత్​లో  చీపురు పట్టి రోడ్డు ఊడ్చారు.  ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయొద్దన్నారు. గాంధీ   జయంతి సందర్భంగా సేవా పక్షోత్సావాలు  నిర్వహిస్తున్నామన్నారు.    

కామారెడ్డి ఎమ్మెల్యే  కాటిపల్లి వెంకటరమణరెడ్డి,  జహీరాబాద్​ మాజీ ఎంపీ బీబీపాటిల్,  పార్టీ జిల్లా ప్రెసిడెంట్​అరుణతార, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు,  నాయకులు మురళీధర్​గౌడ్,  చిన్నరాజులు, రంజిత్​మోహన్,   కృష్ణారెడ్డి, రాంరెడ్డి, రవీందర్​రావు,  నరేందర్​రెడ్డి, లక్ష్మారెడ్డి, భరత్,  లింగారావు, మోటూరి శ్రీకాంత్​ తదితరులు పాల్గొన్నారు.