కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు మరియు బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి తనతో కాంటాక్ట్‌లో ఉన్నవారందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు. జోషి రెండు రోజుల కిందట సోమవారం రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా ఆయన ఆ రోజు సుందరకాండ పఠనంలోనూ పాల్గొన్నారు. ధార్వాడ్ నుంచి లోకసభ ఎంపీగా ఉన్న ఆయన.. కొన్ని రోజుల క్రితం ముగిసిన పార్లమెంట్ సమావేశాలలో కీలక పాత్ర పోషించారు.
For More News..