కార్యకర్తల వల్లే బీజేపీ బలంగా ఉంది..తెలంగాణలో అధికారంలోకి వస్తం

కార్యకర్తల వల్లే నేడు తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. గతంలో ప్రధాని మోదీ రాకను నిషేధించిన అగ్రరాజ్యాలే..ప్రస్తుతం  ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రపంచ దేశాలు ఆహ్వానిస్తున్నాయన్నారు.

Also Read : నలుగురు ఓపెనర్లు ఎందుకు..దేశవాలీ కంటే..ఐపీఎలే ప్రామాణికమా..?

ప్రధాని మోదీ ప్రపంచానికి యోగాను పరిచయం చేశారని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. రామ మందిరాన్ని నిర్మించిన ఘనత ప్రధానమంత్రికే దక్కుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గడికోటను కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల సందర్శించారు.