హైదరాబాద్ కు చేరుకున్న రాజ్ నాథ్ సింగ్

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఘన స్వాగతం పలికారు. రాజ్ నాథ్ సింగ్ కు శాలువా కప్పి వివేక్ సన్మానించారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని  కృష్ణంరాజు ఇంటికి రాజ్ నాథ్ సింగ్ చేరుకున్నారు. రాజ్ నాథ్ వెంట బీజేపీ నేతలు లక్ష్మణ్, చింతల రామచంద్రా రెడ్డి ఉన్నారు.  అక్కడి నుంచి 3 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ కు రాజ్ నాథ్  వెళ్లి.. కృష్ణంరాజు సంతాప సభలో ప్రసంగిస్తారు.

కృష్ణంరాజు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా కొనసాగారు. బీజేపీ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలతో మంచి సంబంధాలున్నాయి. 66 ఏళ్లకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలిగారు. సెప్టెంబర్ 11వ తేదీన అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.