![ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్‌గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు](https://static.v6velugu.com/uploads/2024/09/union-minister-rammohan-naidu-is-the-chairman-of-asia-pacific-member-states_pUl5WJwBGY.jpg)
హైదరాబాద్, వెలుగు: ఆసియా పసిఫిక్ సభ్యదేశాల చైర్మన్‌గా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా -పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్‌నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం తరపున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. ఏవియేషన్ సెక్టార్ ను సామాన్య ప్రజలకు మరింత చేరువ చేస్తానని చెప్పారు. సభ్య దేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.