సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడుతున్నారా..? ఇక మీరు విమానాల్లో ప్రయాణించలేరు..!

సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడుతున్నారా..? ఇక మీరు విమానాల్లో ప్రయాణించలేరు..!


ఇటీవల దేశంలో విమానాలకు బెదిరింపు కాల్స్, మేసేజ్‎లు ఎక్కువయ్యాయి. గడిచిన వారం రోజుల్లోనే దాదాపు 80 విమానాలను పేల్చేస్తామంటూ బాంబ్ బెదిరింపు కాల్స్, సందేశాలు వచ్చాయి. సోషల్ మీడియాలో నకిలీ బాంబ్ థ్రెట్ పోస్టులతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో విమానాలకు వరుస బాంబ్ థ్రెట్స్‎పై కేంద్ర  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు.

 సోమవారం (అక్టోబర్ 21) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బూటకపు బాంబు బెదిరింపుల అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. విమానాలకు నకిలీ కాల్స్ సీరియస్ ఇష్యూ అన్న రామ్మోహన్ నాయుడు.. విమానాలకు నకిలీ బాంబ్ బెదింపు కాల్స్, సందేశాలను పంపడాన్ని నేరంగా పరిగణించేలా ఏవియేషన్ చట్టాన్ని సవరించనున్నట్లు తెలిపారు. 

ALSO READ | బ్రిక్స్ సమావేశాల వేళ భారత్, చైనా మధ్య కీలక ఒప్పందం

తద్వారా ఫేక్ బాంబ్ కాల్స్, మేసేజ్‎లు చేసే వారిని నో ఫ్లై లిస్టులో చేర్చుతామని స్పష్టం చేశారు. దీంతో వారు విమానాల్లో ప్రయాణించలేరని పేర్కొన్నారు. బాంబ్ బెదిరింపులకు పాల్పడుతోన్న నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారని.. దీని వెనక ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు విచారణ స్పీడప్ చేశారన్నారు. 

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇంటెలిజెన్స్‌, ఐబీతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహయం తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటిదాకా 75 విమానాలకు బాంబ్ బెదిరింపులు వచ్చాయని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. దేశంలో విమానయాన రంగానికి అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ఉడాన్ పథకాన్ని మరో పదేళ్లు పొడగిస్తున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.