Google India: గూగుల్ ఇండియాకు కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్..

Google India: గూగుల్ ఇండియాకు కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్..

గూగుల్ ఇండియాకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మంత్రి త్వశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని మోదీకిగురించి అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందనకు సంబంధించి ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఇవి ఐటీ చట్టంలోని నియమాల రూల్ 3(1) బి ప్రత్యక్ష ఉల్లంఘన అని.. క్రిమినల్కోడ్ లోని అనేక నిబంధనల ఉల్లంఘన అని మంత్రి చంద్రశేఖర్ X లో వెల్లడించారు. 

ప్రపంచ నేతల గురించి ప్రశ్నలకు గూగుల్ జెమిని AI సమాధానాలను ప్రదర్శించే ట్విట్ పై మంత్రి చంద్రశేఖర్ ఈ ప్రతిస్పందిస్తూ.. కొన్ని సమాధానాలు సంక్లిష్టం అని లేబుల్ చేశారు. ఇవి చట్టవిరుద్ధంగా ఉన్నాయని Google  ఇండియాను మంత్రి హెచ్చరించారు. గూగుల్ జెమిని ఫ్లాక్ కి గురికావడం ఇదే మొదటి సారి కాదు. ఇటీవల గూగుల్ చారిత్రాత్మక చిత్రాలలో తప్పులను గుర్తించారు. దీంతో జెమిని కృత్రిమ మేధస్సు జనరేషన్ ఫీచర్ ను పాజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 

జెమిని సృష్టించిన చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై కొంతమంది యూజర్లు.. గూగుల్ ను తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే దీనిపై స్పందించిన గూగుల్ .. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ప్రయోజనకరంగా AI ఫీచర్ ఉంటుందని  తెలిపింది. అయినప్పటికీ సాఫ్ట్ వేర్ ఫీచర్ లోని లోపాన్ని కంపెనీ గుర్తించింది. సమస్యను పరిష్కరిస్తామని పేర్కొంది.