
పాట్నా: ట్యాప్ వాటర్ విషయంలో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మేనల్లుళ్ల మధ్య ఘర్షణ తలెత్తి.. ఒకరు హత్యకు గురయ్యారు. గురువారం బిహార్‌లోని భాగల్పూర్ జిల్లా నౌగాచియాలో ఈ ఘటన జరిగింది. నిత్యానంద్ రాయ్ మేనల్లుండ్లు విశ్వజిత్, జయజీత్ కు గురువారం నల్లా నీటి విషయంలో గొడవ జరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
గొడవ పెద్దదవడంతో విశ్వజిత్ పై జయజీత్ గన్ తో కాల్పులు జరిపాడు. కుటుంబ సభ్యులు విశ్వజిత్ ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. గొడవను ఆపేందుకు యత్నించిన విశ్వజిత్ తల్లి హీనా దేవి చేతికి కూడా బుల్లెట్ గాయమైంది. పోలీసులు స్పాట్ కు చేసుకొని ఘటనా స్థలం నుంచి ఒక షెల్ కేసింగ్, ఒక బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.