రక్షణ భూముల్లో 7 ప్రాజెక్టులకు అనుమతిచ్చాం : మంత్రి సంజయ్ సేత్

రక్షణ భూముల్లో 7 ప్రాజెక్టులకు అనుమతిచ్చాం : మంత్రి సంజయ్ సేత్
  • ఎంపీ చామల ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ (జీహెచ్ఎంసీ)లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి రక్షణ శాఖ భూముల్లో 7 ప్రాజెక్టులకు అనుమతిచ్చినట్లు డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. శుక్రవారం లోక్‌‌‌‌‌‌‌‌సభలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. గత మూడేండ్లలో 13 మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనుల కోసం రక్షణ శాఖ భూముల్లో అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం/ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థల నుంచి అభ్యర్థనలు అందినట్లు వెల్లడించారు. .

28 వేల మంది మాజీ సైనికులకు ఉద్యోగాలు

తెలంగాణలో 2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 31 నాటికి త్రివిధ దళాల నుంచి పదవీ విరమణ పొందిన 28,200 మంది మాజీ సైనికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. ఇందులో ఆర్మీ నుంచి 19,455, నేవీ నుంచి 1,532 మంది, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ నుంచి 7,213 మంది ఉన్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వీరు గ్రూప్‌‌‌‌‌‌‌‌ సీ, గ్రూప్‌‌‌‌‌‌‌‌ డీ పోస్టుల్లో భర్తీ అయ్యారని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం లోక్‌‌‌‌‌‌‌‌సభలో ఎంపీ దివేశ్‌‌‌‌‌‌‌‌ శక్య అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.