ఖమ్మం జిల్లాలో  కేంద్ర మంత్రుల ఏరియల్ సర్వే

 ఖమ్మం జిల్లాలో  కేంద్ర మంత్రుల ఏరియల్ సర్వే

న్యూఢిల్లీ, వెలుగు: భారీ వర్షాలతో ముంపుకు గురైన ఖమ్మం జిల్లాలో శుక్రవారం కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్‌‌‌‌‌‌‌‌ చౌహాన్, బండి సంజయ్ పర్యటించనున్నారు. వరద  తీవ్రతపై ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించున్నట్లు బండి సంజయ్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు  ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బండి సంజయ్ కోదాడలోని వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితుల సమస్యలను తెలుసుకోనున్నారు.